FbTelugu

టెన్త్ విద్యార్థులు పాస్: టిఎస్ సర్కార్

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ భయానకంగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం టెన్త్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణత (పాస్‌) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది.

కరోనా మహమ్మారి కారణంగా టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. ప్రకటనకు కొనసాగింపుగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. టెన్త్‌ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే, అభ్యంతరం తెలిపితే వారికి పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.  జూన్‌ రెండో వారంలో సమీక్షించి రెండో సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. బ్యాక్‌లాగ్‌ ఉన్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు వేస్తామని గతంలో ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.