FbTelugu

ఆగస్టు లోనే టెన్త్ ఒరిజినల్ మెమోలు

హైదరాబాద్: టెన్త్ ఫలితాలను ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ పాసైన విద్యార్థులకు మాత్రం ఆగస్టు నెలలో ఒరిజినల్ మెమోలు పాఠశాలలకు పంపించాలని నిర్ణయించింది. అప్పటి దాకా వెబ్ ఫోర్టల్ నుంచి మెమోలను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.

నకిలీ, బోగస్ మెమోలను అరికట్టే చర్యల్లో భాగంగా బార్ కోడ్ తో పాటు మరికొన్ని అదనపు భద్రతా ప్రమాణాలతో టెన్త్ మెమోలను తయారు చేస్తున్నారు. ఒరిజినల్ మెమోల్లో కొన్ని సందర్భాల్లో తప్పులు, అక్షర దోషాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్య కారణంగా పలువురు మళ్ళీ కొత్తవాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకే కాస్త సమయం తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యవసరం ఉన్నవారు వెబ్ సైట్ నుంచి మెమోను డౌన్ లోడ్ చేసుకుని, హెడ్ మాస్టర్ సంతకం తీసుకుని వినియోగించుకోవచ్చని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.