FbTelugu

టెన్త్ పరీక్షలు వాయిదా

కేసారి పరీక్షలకు మొగ్గు లేదా ప్రమోట్?

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.

టెన్త్ పరీక్షల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇవాళ హైకోర్టు టెన్త్ పరీక్షలపై ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించింది. కరోనా ఉధృతి దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనుమతించడం సాధ్యం కాదని, ఈ రెండు జిల్లాల విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

తెలంగాణలోని మొత్తం విద్యార్థులలో సగం మంది ఈ రెండు జిల్లాల నుంచే ఉన్నారు. దీంతో రెండుసార్లు నిర్వహించడం కష్టతరంగా ఉంటుందని భావించిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ తో చర్చించారు. సీఎం ఆదేశం మేరకు ఒకేసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు సబితారెడ్డి ప్రకటించారు.

మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేశాయి. అదే తరహాలో తెలంగాణలో పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది. పరీక్షల నిర్వహణపై ఆదివారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిషత్తుతో ముడిపడి ఉండడంతో సీఎం విద్యావేత్తలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

You might also like