FbTelugu

ప్రశాంతంగానే టెన్త్ పరీక్షలు: ఏపీ మంత్రి

అమరావతి: లాక్ డౌన్ ముగిసి, పరిస్థితులు కుదుట పడిన తరువాతే పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఏ.సురేష్ తెలిపారు.

లాక్ డౌన్ ముగిసిన తరువాత రెండు వారాల అనంతరం పరీక్షలు నిర్వహిస్తామని, సామాజిక దూరం పాటించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు.

ఇవాళ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సురేశ్ పాల్గొన్నారు. డిజిటల్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్ర మంత్రి సూచించినట్టు తెలిసింది.

You might also like