FbTelugu

పరీక్షల రద్దుపై సుప్రీంకోర్టుకు ఏమీ చెప్పని ఏపి

న్యూఢిల్లీ: దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేశాయి. మరికొన్న రాష్ట్రాలు రద్దు చేస్తామని సుప్రీంకోర్టు కు తెలియచేశాయి. కాని ఏపి ప్రభుత్వం మాత్రం తన వైఖరిని సుప్రీంకోర్టుకు తెలియచేయలేదు.

ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అస్సాం, పంజాబ్‌, త్రిపుర రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశాయి. ఇప్పటికే 18 రాష్ట్రాలు టెన్త్ తో పాటు ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. ఇవాళ మరో మూడు రాష్ట్రాలు ప్రకటించడంతో.. ఆ సంఖ్య 21కి చేరింది. పరీక్షల రద్దుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలపలేదు. ఇటీవలే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ తో పాటు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.