FbTelugu

జులై చివరలో పరీక్షలు: ఏపి ప్రభుత్వం

న్యూఢిల్లీ: టెన్త్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకే ఏపి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూలై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

కరోనా కేసులు తగ్గుతున్నందున పరీక్షలు నిర్వహిస్తామని, నిబంధనలను అనుసరించే ముందుకు వెళ్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ ను సమర్పించారు. దేశంలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. మెజారిటీ రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినట్లు తెలపగా, ఏపి ప్రభుత్వం మాత్రం నిర్వహిస్తానని పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.