FbTelugu

ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు

11 పేపర్లు 6 పేపర్లుగా కుదింపు

హైదరాబాద్: టెన్త్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకున్నది. జులై 10 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  ప్రతీ పేపర్ కు 100 మార్కులు గా నిర్ణయించారు.

కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదించారు. వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్) పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షల షెడ్యూలు…

10-07.2020 (శుక్రవారం) –  ఫస్ట్ లాంగ్వేజ్

11-07.2020 (శని వారం)-  సెకండ్ లాంగ్వేజ్

12-07.2020 (ఆదివారం)-  థర్డ్ లాంగ్వేజ్

13-07.2020 (సోమవారం) – గణితం

14-07.2020 (మంగళవారం) –  జనరల్ సైన్స్

15-07.2020 (బుధవారం) – సోషల్ స్టడీస్

16.07.2020 (గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్

17.07.2020 (శుక్రవారం) – ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు.

You might also like

Leave A Reply

Your email address will not be published.