FbTelugu

టెన్త్, ఇంటర్ పరీక్షలు తథ్యం: మంత్రి సురేష్

రాజమహేంద్రవరం: ఆంధ్రా లో టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గాక తప్పనిసరిగా పరీక్షలు జరుగుతాయని ఆయన అన్నారు.

పరీక్షలు రద్దు చేయాలని, ఆన్ లైన్ లో నిర్వహించాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరడం లేదని, ప్రతిపక్ష టిడిపి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం లో ఇవాళ స్థాని ఎంపి మార్గాని భరత్ తో కలిసి మంత్రి సురేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో సురేష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.