FbTelugu

కోర్టు మొట్టికాయలు… టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు

అమరావతి: సుప్రీంకోర్టు ఇవాళ గట్టిగా మొట్టికాయలు వేయడంతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఇవాళ ఉదయం వరకు కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతూ వచ్చింది.

ఒక్క విద్యార్థి చనిపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, ఒక్కో విద్యార్థికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఘాటుగా హెచ్చరించడంతో జగన్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇవాళ సాయంత్రం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ, టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం సాధ్యం కాదని తెలిపారు. అందుకే పరీక్షలు రద్దు చేస్తున్నామని అన్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని నియమిస్తున్నామని, నివేదిక వచ్చిన తరువాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ వివరించారు. ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహిస్తామని డైలాగ్ లు కొట్టిన ముఖ్యమంత్రి, మంత్రి సుప్రీంకోర్టు ఆదేశాలతో తోక ముడవక తప్పలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.