FbTelugu

టెన్త్ పరీక్షలు నెల రోజులు వాయిదా?

అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వచ్చే నెల జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. విద్యాశాఖ మరికొంత సమయం కోరింది.
కరోనా సెకండ్ వేవ్ ఉన్నందున పబ్లిక్ పరీక్షలు నిర్వహించే బదులు, పాస చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థులు కోరినప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్త్ తో పాటు ఇంటర పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసి షెడ్యూలు కూడా ప్రకటించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. టెన్త్ పరీక్షలకు షెడ్యూలు ప్రకటించి విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేకపోవడంతో విద్యాశాఖ పునరాలోచనలో పడింది. ఈ విపత్కర సమయంలో పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉండడంతో పరీక్షల నిర్వహణ కు నెల రోజుల సమయం కావాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది

You might also like

Leave A Reply

Your email address will not be published.