FbTelugu

జూలై 26 నుంచి టెన్త్ పరీక్షలు

అమరావతి: రాష్రంలో టెన్త్ పరీక్షలు జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు.

టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షుల వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన మరుసటి రోజే విద్యా శాఖ కమిషనర్ ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 6.28 లక్షల మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకి హాజ‌రుకానున్నాని ఆయన పేర్కొన్నారు. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 11 పేపర్ల బదులు 7 పేపర్లకి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు నిర్వహించవద్దని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుండగా, నిర్వహించి తీరుతామని జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినా ఏపి ప్రభుత్వం మాత్రం మొండిగా పరీక్షల నిర్వహిస్తానంటోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.