FbTelugu

భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత

జమ్ము కశ్మీర్: భారత్ -చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చైనా పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) బలగాలు వివాదాస్పద ప్రాంతమైన ఫింగర్ 5 ప్రాంతంలోనే తిష్ట వేశాయి. వెనక్కి వెళ్లాలంటూ.. భారత్ చేస్తున్న హెచ్చరికలను చైనా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రధాని మోదీ, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా భారత్ చైనా సరిహద్దులో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చైనా దుందుడుకు చర్యలను తిప్పి కొట్టేందుకు భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

You might also like