FbTelugu

గ్రేటర్ లో పలు చోట్ల ఉద్రిక్తతలు.. మంత్రి కారుపై దాడి

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అనే విధంగా రెండు పార్టీలు తలపడుతున్నాయి.

కూకట్ పల్లి సుజనా ఫోరం మాల్ వద్ద రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వచ్చారు. ఆయన డబ్బులు పంచుతున్నారని సమాచారం అందడంతో నిమిషాల వ్యవధిలో బీజేపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. మంత్రే డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ ను వెంబడించారు. దొరక్కపోవడంతో రాళ్లతో ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకుని బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.