FbTelugu

తూర్పు లద్దాఖ్ లో తీవ్రమౌతున్న ఉద్రిక్తత

భారత్- చైనా సరిహద్దులో ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాలు నువ్వా అంటే నేనా అన్న చందంగా దూసుకొస్తున్నాయి. గతంలో భారత్ ఎప్పుడూ ఇంతలా.. ప్రతిదాడికి దిగలేదు. కానీ తాజాగా చైనా కవ్వింపులకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

గాల్వాన్ ఘటన అనంతరం భారత్ సరిహద్దులో మొత్తం పరిస్థితినే మార్చేసింది. చైనా దురాక్రమణలకు దీటుగా.. భారత్ భారీ సంఖ్యలో సైన్యాన్ని దించి గట్టి సవాల్ విసురుతోంది. సరిహద్దు ప్రాంతాలకు ఇప్పటికే అనేక యాంటీ ట్యాంక్ మిసైళ్లను తరలించింది. ఓ పక్క చర్చలు జరుపుతున్నప్పటికీ ఏమాత్రం ఫలింతం ఉండడం లేదనే చెప్పవచ్చు.

You might also like