FbTelugu

ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్తత

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకున్నది. బీజేపీ యువ మెర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఎన్.సీ.సీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ బీజేపీ కార్యకర్తలను వెళ్లనీయలేదు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తల కు వాగ్వాదం జరిగింది. అమరవీరులకు నివాళలు అర్పించేందుకు క్యాంపస్ కు వచ్చానని సూర్య అన్నారు. పోలీసులను తోసివేసి ముందుకు కదిలారు. ఆర్ట్స్ కళాశాల ముందు సూర్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే, వచ్చిన తరువాత కేసీఆర్ కుటుంబపరం అయ్యిందన్నారు. కుటుంబంలోని వారు ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు ఏమీ రాలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలకు తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని ఆయన ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.