FbTelugu

నాగోల్ ప్రధాన రహదారి పై ఉద్రిక్తత

Tension-on-Nagol-main-road

హైదరాబాద్: నాగోల్ ప్రధాన రోడ్డు పై రెవెన్యూ ఉద్యోగులు బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. ఆందోళన చేయవద్దంటూ రెవెన్యూ ఉద్యోగులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సముదాయించారు. తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు నాగోల్ రోడ్డుపై అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో వందలాది మంది రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

You might also like