FbTelugu

కర్నాటక డిజే హళ్లిలో ఉద్రిక్తత

బెంగళూరు: ఒక మతాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టు అల్లర్లకు దారితీసింది. శాంతి భద్రతల సమస్యగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన డిజీ హళ్లి నియోజకవర్గంలో చోటు చేసుకున్నది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి అల్లుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఒక మతాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టుపై పెద్ద ఎత్తున అల్లర్లు, విధ్వంసాలు జరిగాయి. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేయడంతో పాటు వందలాది వాహనాలకు నిప్పంటించారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు చనిపోయారు. ఏసీపీ సహా 60 మంది పోలీసు బలగాలకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ఒక ప్రాంతంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ముస్లిం యువకులు అడ్డుకున్నారు. మానవ హారంగా ఏర్పడి ఆలయాన్ని రక్షించి, ఆ ప్రాంతంలో అల్లర్లు జరక్కుండా చూశారు.

You might also like