FbTelugu

ఎల్ఏసీ వెంట ఉద్రిక్తం: ఆర్మీ చీఫ్

లేహ్: వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం.నరవాణే తెలిపారు. గత రెండు మూడు నెలలుగా ఎల్ఏసీ వెంట ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు.

చైనాతో సరిహద్దు సమస్యల నేపథ్యంలో నరవాణే లేహ్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన తాజా పరిస్థితిపై భద్రతా బలగాలతో సమీక్షించారు. తరువాత ఆయన మీడియతో మాట్లాడుతూ, లేహ్ చేరుకున్న అనంతరం పలు ప్రాంతాలను పర్యటించానన్నారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని, పోరాట స్ఫూర్తి అధిక స్థాయిలో ఉందని నరవాణే అన్నారు.

ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయిని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన స్పస్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, విభేధాలు సమసిపోతాయని నరవాణే అన్నారు.

You might also like