FbTelugu

విజయసాయిరెడ్డి కారుపై చెప్పులతో దాడి

* విజయసాయిని అడ్డుకున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు
* పగిలిన కారు అద్దం.. వేరే కారులో వెళ్లిపోయిన విజయసాయి
* రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం
విజయనగరం: రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఇవాళ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలో కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఇవాళే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడి టీడీపీ, బీజేపీ శ్రేణులు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ నినదించారు.

అయినప్పటికీ విజయసాయిరెడ్డి పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. తిరుగుపయనం అవుతున్న విజయసాయికి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని నిలువరించలేక పోయారు. కారుపై చేతులతో బాదారు. చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో విజయసాయి కారు అద్దం పగిలింది. దీంతో వేరే కారులో విజయసాయిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.