FbTelugu

రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం

* కొండపైకి వెళ్లేందుకు బీజేపీ, జనసేన యత్నం
* చలో రామతీర్థానికి పోలీసులు బ్రేకులు
విజయనగరం: ఇవాళ ఉదయమే రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఇవాళ ఉదయమే కొండపైకి వెళ్లేందుకు యత్నించగా.. వారిన పోలీసులు అడ్డుకున్నారు. తమకు కొండపైకి వెళ్లేందుకు అనుమతించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.

కానీ ఆ ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉందని వారికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు దిగ్భందం చేశారు. నెల్లి మర్ల దగ్గర బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.