FbTelugu

ఆస్ట్రేలియా ప్రేక్ష‌కుల తీరుపై స‌చిన్ ఆగ్రహం

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లను చూడ‌డానికి వ‌చ్చిన కొంద‌రు ఆస్ట్రేలియా ప్రేక్ష‌కుల వింత ప్రవర్తనపై టీమిండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వరుసగా రెండవ రోజూ భార‌త‌ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై‌ జాత్యహంకార వ్యాఖ్య‌లు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఆటలు అందరినీ కలుపుతాయని, అంతేగానీ మనుషులను విడదీయబోవని అన్నారు. ఆటగాళ్ల ప్రతిభను మాత్రమే చూడాలని వారి రంగు, జాతి కాదని హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.