గుంటూరు: తెనాలి ప్రభుత్వ వైద్యశాల రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ) కరోనాతో మృతి చెందారు.
ఆర్ఎంఓ మృతిచెందినట్లు తెనాలి జిల్లా వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ సనత్ కుమారి ప్రకటించారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొదట గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారని ఆమె పేర్కొన్నారు.
ఉస్మానియా సూపరింటెండెంట్ కు కరోనా…
హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు కరోనా సోకింది. టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు.