FbTelugu

వామ్మో… పది రెట్లు ప్రమాదకరమంట?

కౌలాలంపూర్: కరోనా వైరస్ లతో ఇప్పటికే ప్రపంచం చిగురాటాకులా గడగడలాడుతుండగా మరో బలమైన వైరస్ తెరమీదికి వచ్చింది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు అదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ తరుణంలో మలేషియా ప్రభుత్వం బాంబు పేల్చింది.
కొత్త వైరస్ జాతిని మలేషియా వైద్య నిపుణులు గుర్తించారు. ఇప్పుడున్న వైరస్ కన్నా పది రెట్లు ప్రమాదకరమైన వైరస్ జాతి వెలుగు లోకి వచ్చిందని తెలిపారు. వేగంగా వ్యాప్తి చెందేలా వైరస్ మార్పునకు గురైనట్లు సమాచారం వచ్చిందిన అమెరికా అంటువ్యాధి నిపుణుడు డా.ఆంథోని ఫౌసి హెచ్చరించారు.

దీనికి డీ614 గా నామకరణం చేశారు. తాజాగా మలేషియాలోని ఒక రెస్టారెంట్ యజమాని నుంచి ప్రారంభమైన క్లస్టర్ 45 కేసులు వెలుగు చూశాయి. అందులో మూడు కేసుల్లో ఈ రకమైన వైరస్ ఉంది. సదరు యజమాని ఇటీవలే ఇండియా నుంచి వచ్చి క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించాడు. రెస్టారెంట్ కేంద్రంగా 45 కేసులు రావడంతో అతినికి ఐదు నెలల జైలు శిక్ష తో పాటు జరిమానా విధించారు.

పరివర్తనం చెందుతున్న డీ614 వైరస్ సంక్రమణ గోలుసును విచ్చిన్నం చేయాలంటే ప్రజల సహకారం అవసరం అని అంటున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న క్లస్టర్ లో కూడా ఈ జాతి వైరస్ కనుగొన్నారు. ఇండియా లాంటి దేశాల్లో డీ614 రకం వైరస్ విజృంభిస్తే ప్రజల మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

You might also like