FbTelugu

అగ్నిప్రమాదంలో పది మంది చిన్నారుల మృతి

ముంబై: భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది పిల్లలు మరణించారు.

జిల్లా ఆసుపత్రిలోని చిన్నారులకు చికిత్స అందిస్తున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సియూ) లో  శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు గదిలో పొగ రావడం గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులను తెలియచేసి అప్రమత్తం చేసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో తేరుకునేలోపే భారీ నష్టం జరిగింది. ఈ సమయంలో 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని అక్కడున్న నర్సులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పదిమంది పిల్లలు మరణించడంతో ఆసుపత్రిలో విషాదం అలముకుంది. ఈ ప్రాంతం తల్లిదండ్రుల పెడబొబ్బలు, రోదనలతో నిండిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.