FbTelugu

ఒకే కాన్పు… పది మంది పిల్లల జాడలేదు!

ప్రిటోరియా: దక్షిణాఫ్రికా దేశంలో ఒక మహిళ ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనివ్వడం ప్రపంచంలోనే సెన్సేషన్ గా మారింది. బిడ్డలు పుట్టిన తరువాత తల్లీ, బిడ్డల ఫొటోలను ఇంత వరకు బయటకు విడుదల కాలేదు.
తప్పుడు ప్రచారంతో విరాళాలు వసూలు చేసేందుకు ఈ నాటకం ఆడుతున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఈ వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా కథనాలు ప్రసారం చేసిన మీడియా హౌస్ లు విస్తుపోయాయి. టెంబిసా పట్టణంలో గోసయామె తమార సిత్ హోల్ (30) భర్తతో కలిసి నివసిస్తున్నది.

నెలలు నిండక ముందే పది మంది పిల్లలకు హాస్పిటల్ లో జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కాని, హాస్పిటల్ యాజమాన్యం కాని ఇంత వరకు ధృవీకరించకపోవడం తో విమర్శలు మొదలయ్యాయి.
స్టీవ్ బికో అకాడెమిక్ హాస్పిటల్ లో తాను పది మందిని కన్నానని సిత్ హోల్ చెప్పగా, అలాంటి జననాలు తమ వద్ద జరగలేదని హాస్పిటల్ సిఈఓ మథాబో మాథ్యుబెలా ఖండించారు. ఇలాంటి క్లిష్టమైన కేసులలో ప్రసవాలు చేసే మిగతా హాస్పిటళ్లు కూడా ఈ వార్తలను ఖండించాయి. ఇదిలా ఉండగానే ఆమె భర్త టెబెహో సొటెట్సి స్టేట్ మెంట్ తో బండారం బట్టబయలైంది. విరాళాలు పంపించవద్దని, అసలు ఆ పిల్లలు ఎక్కడున్నారో తనకు తెలియదని అన్నారు. వాళ్ళు ఇంటికి వచ్చేదాకా విరాళాలు ఇవ్వవద్దు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుననారు. 2018లో కూడా ఇలాగే తనకు ఒకే కాన్పులో ముగ్గురు జన్మించారని స్టేట్ మెంట్ ఇచ్చిందని, ఒక్కరూ జాడలేరని ఆయన మీడియాకు తెలిపారు. డబ్బుల కోసమే భార్యాభర్తలు నాటకమాడారని దక్షిణాఫ్రికా వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.