FbTelugu

రాజుపాలెం గ్రామంలో జగన్ కు ఆలయం

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

ఇతర రాష్ట్రాల్లోనూ జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని కితాబు

ప.గో.జిల్లా: ఆంధ్ర ప్రజలకు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి దేవుడై పోయాడు.  గోపాలపురం మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు నిర్మిస్తున్న గుడిలో జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను దేవుడితో సమానమని అన్నారు. దేశంలోనే కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ అగ్రగామిగా ఉందని కొనియాడారు. కరోనా అడ్డంకులు సృష్టిస్తున్నా, సీఎం జగన్ వెనుకంజ వేయకుండా అభివృద్ధి, సంక్షేమంలో దూసుకువెళ్తున్నారని కితాబునిచ్చారు. ఈ ఆలయాన్ని స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం నిర్మిస్తోందని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు.

You might also like