FbTelugu

3 దశాబ్ధాల తరువాత తెరుచుకున్న గుడి

శ్రీనగర్: ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా జమ్మూ కాశ్మీర్ కొన్ని దశాబ్ధాలుగా దేవాలయాలు మూతపడ్డాయి. దూపదీప నైవేద్యాన్ని కూడా నోచుకోవడం లేదు. ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితులు కుదురుపడుతున్నాయి.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం, ప్రశాంతత నెలకొనడంతో వ్యాపారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మూడు దశాబ్ధాల క్రితం మూతపడిన శీతల్ నాథ్ ఆలయం తెరుచుకున్నది. శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతలోని శీతల్ నాథ్ ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇక్కడ పూజలు చేసేవారని, ఉగ్రవాదం కారణంగా మూతపడిందని భక్తుడు సంతోష్ రజ్డాన్ తెలిపారు. స్థానికంగా ఉంటున్న ముస్లిం కుటుంబాలు కూడా ఆలయం తెరిచేందుకు సహకారం అందించారని పూజారి రవీందర్ రజ్డాన్ తెలిపారు. ముస్లింలే ముందుకు వచ్చి ఆలయాన్ని శుభ్రం చేశారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.