FbTelugu

ఆలయంలో అత్యాచారం… ప్రధాన నిందితుడు అరెస్టు

లక్నో: దేవుడి దర్శనం కోసం ఆలయం వెళ్లిన మహిళను ఆలయంలోనే సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో అందరినీ అరెస్టు చేశారు. బుధవారం నాడు ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు గురువారం రాత్రి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బదౌన్ జిల్లాలో ఉగైతి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అంగన్ వాడీలో పనిచేస్తున్న ఒక మహిళ (50) దేవుడి దర్శనం కోసం వెళ్లింది. ఆలయ ప్రధాన పూజారి సత్యానారాయణ (45)తో పాటు జస్పాల్, వేదారామ్ లు ఒకరి తరువాత మరొకరు ఆమెను అత్యాచారం జరిపారు. ఆ తరువాత ఆమె జననాంగాల్లోకి ఇనుప రాడ్డును చొప్పించి చంపేశారు. చనిపోయినట్లు నిర్థారించుకున్న నిందితులు ఆమె శవాన్ని ఇంటి వద్ద వదిలేసి పారిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది.
ఈ గ్యాంగ్ రేప్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం సంబంధిత పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.