* ఆసీఫాబాద్ లో 7.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రంగా పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి.
రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన ఉష్ణోగ్రతల్లోనే అత్యల్పంగా నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో 7.1 డిగ్రీలకు పడిపోయింది. అలాగే పలు ప్రాంతాల్లో 9 డిగ్రీలు, 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి.