FbTelugu

ఏపీ సీఎస్ వైసీపీ కండువా కప్పుకోవాలి: అచ్చెన్న

అమరావతి: బిజినెస్ రూల్స్ తెలుసుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు.

మత సామరస్య కమిటీలను నియమిస్తూ ఇచ్చిన జీఓ నెం.6 ఒక ప్రభుత్వ అధికారి తయారు చేసినట్లుగా లేదన్నారు. ఇది సెక్రటేరియట్ లో తయారైందా లేక తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు తయారుచేసిన జీఓనా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు తయారుచేసిన జీఓ పై సీఎస్ కళ్లుమూసుకుని సంతకం పెట్టారా? లేక సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వైసీపీ కండువా కప్పుకున్నారా? అని నిలదీశారు. జగన్ రెడ్డి పాలనలో ఇప్పటిదాకా కొంతమంది పోలీసులే వైసీపీ కండువా కప్పుకున్నారని ప్రజలు భావిస్తున్నారని అచ్చెన్న అన్నారు.

ఇప్పుడు ఈ జీఓ తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా ఉన్నతాధికారుల్లో కొందరు కూడా వైసీపీ కండువా వేసుకున్నట్లుగా ఉందన్నారు. గతంలో జగన్ రెడ్డికి మేళ్లు చేకూర్చిన అధికారులకు ఏ గతి పట్టిందో మనం చూశామన్నారు. 2014-19 మధ్య పాలసీ పెరాలసిస్ జరిగిందని సీఎస్ ఏ విధంగా చెబుతారు? మీరు సీఎస్ గా పనిచేస్తున్నారా, లేక వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారా? అని అడిగారు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.