FbTelugu

వేటూరి, సిరివెన్నెల తెలుగు యూనికోడ్ ఫాంట్స్

హైదరాబాద్: తెలుగు భాష ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, ఈ లెర్నింగ్ లో తోడ్పడేందుకు ప్రముఖ రచయిత వేటూరి, తన పేరుతో యూనికోడ్ ఫాంట్స్ తీసుకురావడం అభినందనీయమని పాటల రచయిత సిరివెన్నెల సీతారామా శాస్త్రి అభినందించారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో వేటూరి, సిరివెన్నెల ఫాంట్స్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామా శాస్త్రి మాట్లాడుతూ, సాంకేతిక పెరిగాక అక్షరాలను ఎంతో అందంగా తయారు చేస్తున్నారన్నారు. ఆ అందం మన తెలుగు అక్షరాల్లో ఎప్పటి నుంచో ఉందని, ఆ ఖ్యాతిని ఇనుమడింపచేస్తూ కొత్తదనాన్ని తీసుకువచ్చేందుకు అంబరీష ఎంతో కృషి చేస్తున్నాడని అభినందించారు. క్రౌండ్ ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు 30కి పైగా తెలుగు ఫాంట్స్ తయారు చేశారన్నారు. నేను రచయితగా అర్హత సంపాదించడానికి ప్రేరణగా నిలిచిన వేటూరి పేరుతో తెలుగు ఫాంట్స్ ఆవిష్కరించడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని సిరివెన్నెల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబరీష తో పాటు ఆయన భార్య సుధారాణి పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.