తెలంగాణ 7100, ఏపీ 8,500 కరోనా కేసులు. వారం రోజులుగా సగటున రోజుకు 500-600 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, 190 మంది పోలీసులు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు, ఒక ఐఏఎస్, ఎమ్మెల్యే, మంత్రి గన్మెన్లున్నారు. కార్పోరేటర్ల లెక్క బయటకు రావట్లేదు. నిన్నటి వరకూ జనంలో తిరుగుతూ.. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికీ వైరస్ బాధ తప్పేలా లేదనే ఆందోళన నెలకొంది.
తెలుగు నాట వైరస్ కట్టడి విషయంలో భిన్నవైఖరి అవలంభిస్తున్నారు. పైకి గంబీరంగా కనిపిస్తున్నా.. మొదట్లో అంటే.. మార్చి చివర్లో ఉన్న భయం ఎక్కడా కనిపించట్లేదు. లాక్డౌన్ సమయంలో అదుపులో ఉన్న వైరస్ క్రమంగా విస్తరిస్తూ చివరకు చేతులెత్తేసే పరిస్థితికి చేరింది. దీనిలో జనం కూడా భాగస్తులు అవుతున్నారు. ప్రమాదకరమైన వైరస్ అని తెలిసినా అధికశాతం మాస్క్‌లు ధరించట్లేదు. భౌతికదూరం కేవలం మాటలకే పరిమితమైంది.
ఒక్క హైదరాబాద్‌లో ప్రతి పదిమందిలో ఒకరిద్దరు పాజిటివ్ ఉండొచ్చనే ఆందోళన మరింత గుబులు పుట్టిస్తుంది. జనసాంధ్రత అధికంగా ఉండే నగరాలు, పట్టణాల్లో వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉంది. వర్షాకాలం ప్రారంభమైన సమయంలో మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని మాత్రం వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో సుమారు 160 మంది వైద్యులు కూడా కరోనా లక్షణాలతో స్వీయ వైద్యం తీసుకుంటున్నారు.
కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, ఏపీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణం వంటి ప్రదాన నగరాలను వైరస్ చుట్టేస్తుంది. కరోనాకు మందు వచ్చిందని చెబుతున్నా.. అధికారికంగా ఎక్కడా వైద్య సంస్థలు విడుదల చేయలేదు. దీనిపై ఇప్పటికీ సందిగ్థత నెలకొంది. మొదట్లో లాక్డౌన్ అంటూ ఘనంగా చెప్పిన ప్రధాని కూడా.. ఇటు చైనా, అటు పాకిస్తాన్, నేపాల్‌తో సరిహద్దు వివాదాలతో సరిపోతుంది. కరోనా భారం భరించాల్సింది ఇక ప్రజలేనంటూ ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసినట్టుగానే కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రచ్చ.. 2024 ఎన్నికల్లో విజయంపై చూపుతున్న శ్రద్ధ వైరస్ కట్టడి.. ప్రజాసంక్షేమంపై చూపట్టేదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాల్సింది ప్రజలే.