FbTelugu

అపోలో నుంచి విజయసాయి డిశ్చార్జీ

హైదరాబాద్: కరోనా వైరస్ సోకి జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఇవాళ డిశ్చార్జీ అయ్యారు. ఆ తరువాత ఆయన నేరుగా తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.
మరో పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల క్రితం అపోలో హాస్పిటల్ లో చేరారు. పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఫోన్ చేయవద్దని సూచించారు. లాక్ డౌన్ సమయంలో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. కొన్ని కార్యక్రమాలకు విజయసాయి రెడ్డి మాస్క్ లేకుండానే హాజరయ్యారు.

You might also like