FbTelugu

ఇక నుంచి చెక్క పుల్లలతో ఓటింగ్…

ఢిల్లీ: ఇక నుంచి జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు చెక్క పుల్లలు అందచేస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఓటింగ్ తగ్గే అవకాశాలు ఉండడంతో కమిషన్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. 65 సంవత్సరాలు పైబడిన వారు పోలింగ్ కేంద్రాలకు రాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

అదే విధంగా కరోనా పేషెంట్లకు ఈ సదుపాయం కల్పించారు.
తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. కరోనా మరింతగా విజృంభించినా ఓటింగ్ కు దూరం కాకుండా మరిన్న చర్యలు తీసుకున్నది. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్క్ అందించడంతో పాటు బూత్ లోకి వెళ్లే ముందు, వచ్చిన తరువాత శానిటైజ్ చేస్తారు. బూత్ లోపల ఈవీఎంపై బటన్ నొక్కేందుకు చెక్క పుల్లను అందచేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ నిర్ణయాలు కమిషన్ తీసుకున్నది.

You might also like