FbTelugu

కల్నల్ కుటుంబానికి సీఎం కేసీఆర్ విందు

హైదరాబాద్: ఇండియా-చైనా సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కల్నల్ భార్య సంతోషి, పిల్లలు, అత్త, మామలు, కుటుంబ సభ్యులు మొత్తం 20 మంది హాజరయ్యారు. తొలుత వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీ కుటుంబానికి ప్రభత్వుం ఎల్లప్పుడు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఆ తరువాత సంతోష్ బాబు భార్యకు సీఎం కేసీఆర్ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ పత్రాలను అందచేశారు.
హైదరాబాద్ చుట్టు పక్కల పోస్టింగ్ ఇవ్వాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సంతోషికి సరైన చికిత్స ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు సహకారం అందించాలని ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ను సీఎం ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

You might also like