FbTelugu

విజయవాడకు బారులు తీరిన వాహనాలు

హైదరాబాద్ నుంచి విజయవాడకు వాహనాలు బారులు తీరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.. అందులోనూ కొత్తగా నమోదౌతున్న కేసుల్లో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదౌతుండడంతో హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నారన్న వార్తలొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఉన్న ఇతర ప్రాంతాల వారంతా తమతమ ప్రాంతాలకు పయనమౌతున్నారు.

జాతీయ రహదారి 65 వాహనాలతో కిటకిటలాడుతోంది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూకట్టాయి.

You might also like