FbTelugu

సీనియర్లు తల్లిని క్షోభకు గురిచేశారు: రాహుల్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభంపై నర్మగర్భంగా ఉన్న రాహుల్ గాంధీ ఒక్కసారిగా తన ఆవేదన వెల్లగక్కారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సీనియర్లు లేఖ రాశారని, ఆ లేఖ తన తల్లిని ఎంతో క్షోభకు గురిచేసిందని ఆయన తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంక్షోభం ఉన్నప్పుడు, తన తల్లి ఆరోగ్యంగా లేదని గమనించే సీనియర్లు ధిక్కార స్వరం విన్పించారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ తో చేతులు కలిపి నేతలంగా కుట్రలు పన్నుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సైతం బీజేపీతో జతకట్టి పార్టీపై విమర్శలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ సైతం అంగీకరిస్తునే, పై విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోవాలని 26 మంది సీనియర్లు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీనిపై అధిష్టానం అదేం లేదని, ఒట్టిదేనని ఇప్పటి వరకు కొట్టిపారేసింది. ఇవాళ జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో లేఖ నిజమేనని వెల్లడి అయ్యింది.

You might also like