FbTelugu

నేటి నుంచే మహానాడు

ఆన్ లైన్ లోనే టీడీపీ ప్రతినిధుల వీక్షణ

రెండు రోజుల పాటు సమావేశాలు

అమరావతి: కరోనా విజృంభణ కారణంగా తెలుగుదేశం పార్టీ ఆన్ లైన్ లో మహానాడు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు. రెండు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు.

ఉదయం అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు దివంగత నేత ఎన్టీరామారావుకు తొలుత నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఆన్ లైన్ లో తొలిరోజున వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు, అక్రమ కేసుల బనాయింపులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి. సుమారు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో వీక్షించనున్నారు.

You might also like