FbTelugu

వాట్సప్ ప్రైవసీ పాలసీ పై టెలిగ్రామ్ మీమ్

వాట్సప్ ప్రైవసీ పాలసీపై ఒక రంగానికి చెందిన వారే కాదు అన్ని రంగాలతో పాటు ప్రత్యర్థి సంస్థలు కూడా ఆడుకుంటున్నాయి. నూతన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సప్ యూజర్ల డేటాను ఫేస్ బుక్ కూడా వినియోగించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో పలువురు యూజర్లలో గుబులు మొదలైంది. ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్న తరుణంలో వారికి ఆశా దీపంలా టెలిగ్రామ్ తోపాటు సిగ్నల్ కన్పించింది. ఇప్పటికే పలువురు టెలిగ్రామ్ లో ఉండగా తాజాగా సిగ్నల్ యాప్ ను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. గడచిన వారం రోజుల వ్యవధిలో ఈ రెండు యాప్ లను డౌన్ లోడ్ చేసుకునేవారి సంఖ్య 70 శాతం మేర పెరిగింది.

తాజాగా టెలిగ్రామ్ యాప్ తమ ట్విటర్ ఖాతాలో ఒక మీమ్ ను పోస్ట్ చేసింది. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన కాఫిన్ డ్యాన్స్ మీమ్ కు వాట్సప్ ప్రైవసీ పాలసీ స్క్రీన్ షాట్ ను అంటించారు. శవపేటిక ముందున్న ప్రైవసీ పాలసీ మీమ్ ను చూసిన నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తూ వాట్సప్ పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.