FbTelugu

ఈ ఏడాది మొబైల్ మోత తప్పదా!

ముంబై: మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. పోటీ కారణంగా కంపెనీలు ధరలు తగ్గించడంతో గత నాలుగేళ్లుగా వినియోగదారులకు ఊరట లభించింది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం పెంచుకోవడానికి ఛార్జీల పెంపుదలే శరణ్యంగా భావిస్తున్నాయి. మొబైల్ ఇంటర్ నెట్ తక్కువ ఛార్జీలకు లభిస్తుండడంతో పలువురు 2 జీ నుంచి 4 జీ మొబైల్ కు మారిపోయారు. కోట్లాది మంది స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేశారు. వినియోగదరులు కూడా టీవీలు చూడడం మానేసి అన్ని మొబైల్ లోనే వీక్షిస్తుండడం డేటా వినియోగం పెరిపోయింది.

వీరి వీక్ నెస్ ను ఆధారంగా డేటా ఛార్జీలు, కాల్ ఛార్జీలు పెంచాలనే నిర్ణయానికి టెలికాం కంపెనీలు వచ్చాయి. పెరుగుదల మూలంగా రానున్న రెండేళ్లలో కంపెనీల ఆదాయం 13 శాతం వరకు పెరగవచ్చని అంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ రంగంపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. పలువురు ఇళ్ల నుంచే పనిచేయడం మూలంగా డేటా వినియోగం రెట్టింపు కాగా కాల్స్ కూడా మూడింతలు పెరిగాయి. డిసెంబర్ 2019లో ఛార్జీలు పెంచిన కంపెనీలు అప్పటి నుంచి తమకు నష్టాలు వస్తున్నాయని సన్నాయి నొక్కులు నొక్కుతునే ఉన్నాయి. ఈ ఛార్జీలతో కంపెనీలను నడపడం కష్టం అని ఎయిర్ టెల్ అధినేత సునిల్ ప్రచారం చేసుకోవడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.