FbTelugu

తెలంగాణకు తొలి మహిళా సీజే

* ప్రమాణ స్వీకారం చేసిన హిమకోహ్లీ
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. హిమ కోహ్లీ ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించారు. తెలంగాణ హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కాగా, ఆయన స్థానంలో జస్టిస్ అరూప్ గోస్వామి నూతన ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ హిమ కోహ్లీతో ప్రమాణస్వీకారం చేయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.