FbTelugu

తెలంగాణ లెక్క@891

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 891 కేసులు నమోదు అయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో వరుసగా రంగారెడ్డిలో 86, మేడ్చల్ లో 55 కేసులు వచ్చినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో ఆరు నుంచి ఒకటి చొప్పున కేసులు నమోదు అయినప్పటికీ గ్రేటర్ లో మాత్రం పెరుగుతునే ఉన్నాయి. ఇవాళ ఐదుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు 225 మంది చనిపోయారు.

ఇప్పటి వరకు 10444 పాజిటివ్ కేసులు రాగా 4361 మంది డిశ్చార్జీ అయ్యారు. 5858 మంది ప్రస్తుతం హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారు.

You might also like