FbTelugu

తెలంగాణ@237

హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 237 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 195 పాజిటివ్ కేసులు వచ్చాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 4974 కాగా ఇప్పటి వరకు 2377 మంది డిశ్చార్జ్ అయ్యారు. యక్టివ్ కేసులు 2412 ఉండగా, వీరందరూ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇవ్వాళ ముగ్గురు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 185 ప్రాణాలు కోల్పోయారు.

గ్రేటర్ హైదరాబాద్ లోనే కేసులు అధికం అవుతుండడంతో ఇవాళ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కనీసం 50 వేల మంది పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

You might also like