హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య25,733కు చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 1,419 పాజిటివ్ కేసులు రాగా, మిగతా కేసులు జిల్లాల్లో నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 2,078 మంది డిశ్చార్జీ కాగా ఇప్పటివరకు 14,781 మంది డిశ్చార్జీ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 11 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 306 మరణించారు.