FbTelugu

మూర్ఖుడి చేతిలో నలుగుతున్న తెలంగాణ

ఘాటు విమర్శలు చేసిన బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ తల్లి కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో నలిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.

ఇవాళ నాంపల్లి లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. నియామకాల విషయంలో తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు.

కేసీఆర్ గడీలు బద్ధలు కొట్టడానికి బీజేపీ మలిదశ ఉద్యమం ప్రారంభించబోతోందని ఆయన అన్నారు. కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడన్నారు. హామీల అమలో కేసీఆర్ విఫలమయ్యారు. కేసీఆర్ తన అబద్దాల రికార్డును తానే బద్ధలు కొట్టాడన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. విద్యా, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ ద్వారా ఇంటర్ విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, సుమారు ఇరవై మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

 

ఎన్నికలప్పడే తెలంగాణలో రైతు బంధు అమలవుతోందని, ఆ తరువాత మసకబారుతోందన్నారు. తెలంగాణలో కేంద్ర అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు మాత్రమే అమలవుతున్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఎటు వెళ్ళాయో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

You might also like