FbTelugu

తెలంగాణ ను చూసి నేర్చుకోండి: బండ్ల గణేశ్

కరోనా కష్టకాలంలో ఎలా ఉండాలో తెలంగాణ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలని టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ హితవు పలికారు.

టీవీ ఛానళ్లలో వార్తలను చూస్తుంటే ఏపీ రాజకీయ నాయకులు ప్రతి నెలా ఎన్నికలు వస్తాయేమోనన్న భయంతో చర్చల్లో పాల్గొంటున్నట్లు అనిపిస్తుందని గణేశ్ ట్వీట్ చేశారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయనే విషయాన్ని ఏపీ నేతలు గమనించాలన్నారు.

రాజకీయాలను పక్కనపెట్టి, దేవుడి మీద ప్రమాణాలు చేసే బదులు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వెయ్యేండ్లు బతకడానికి రాలేదని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గణేశ్ ఉదహరించారు.

You might also like