FbTelugu

హుజూరాబాద్ హీట్… రమణకు టిఆర్ఎస్ గాలం!

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్ధేశంతో ముందున్న ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ కు ఎమ్మెల్సీ పదవి గాలం వేసి చేర్పించుకునేందుకు పావులు కదుపుతోంది.
తన శాసనభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అప్పాయింట్ మెంటు కూడా అడిగారు. నేడో రేపో ఆయన తన రాజీనామాను సమర్పించనున్నారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ను టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు చర్చలు మొదలుపెట్టారు. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగి రమణతో చర్చిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వగా సుముఖత చూపించినట్లు సమాచారం.

కొద్ది రోజులుగా రమణతో టిఆర్ఎస్ నేతలతో పాటు బిజెపి నేతలు కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే రమణ టిఆర్ఎస్ వైపు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. త్వరలోనే ఆరు ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటా కింద మరో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఆరు ఖాళీలలో ఒకటి ఇచ్చేందుకు టిఆర్ఎస్ పెద్దలు ముందుకు వచ్చారు. దీనిపై రమణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సన్నిహితులు, కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని రమణ చెప్పినట్లు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.