FbTelugu

సేఫ్ జోన్ లో తెలంగాణ రాష్ట్రం: సోమేష్ కుమార్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. తెలంగాణలో పూర్తిస్థాయి లాక్ డౌన్ లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, వీకెండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్ మెడికల్ హబ్ అని, ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఇక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారన్నారు. ఆక్సిజన్, మందుల కొరత లేనే లేదని, అయినప్పటికీ ఆక్సిజన్ బెడ్స్ పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం కోవిడ్ సెంటర్లలో 62వేల మంచాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో 135 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నదని, ఒడిశా నుంచి ఎయిర్ కార్గోలో తెప్పిస్తున్నామన్నారు. కరోనా కట్టడి కోసం ఎంత ఖర్చయినా వెనకాడవద్దని సిఎం కెసిఆర్ చెప్పారన్నారు. రాష్ట్రంలో 90వేల రెమడెసివర్ వయల్స్, టోసిలిజుమాబ్ 63వేల వయల్స్ స్టాక్ ఉందని సోమేష్ కుమార్ వివరించారు.
కరోనాతో ఎవరూ భయపడవద్దని, సాధారణ చికిత్సతో తగ్గిపోతుందన్నారు. త్వరలోనే తెలంగాణలో సాధారణ పరిస్థితులు వస్తాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.