FbTelugu

తల్లడిల్లుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కరోనా కేసులతో తల్లడిల్లుతోంది. కుప్పలు తెప్పలుగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా వైరస్‌ ఉధృతి తగ్గకపోగా.. అది ఇంకా తీవ్రంగా విజృంభిస్తోంది.

గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న కేసులు బుధవారం మాత్రం రాష్ట్రాన్ని వణికించాయి. ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో 107 కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చిన తర్వాత ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అతిపెద్ద రికార్డు. వైరస్‌ సోకిన వారి సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 63మంది మృత్యువాత పడగా, బుధవారం ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు వదిలారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 39 మందికి, 19 మంది వలసకార్మికులతో పాటు విదేశాల నుంచి వచ్చిన 49 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇప్పటివరకు 2,098 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 63 మంది మృతి చెందారు. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణలో కరోనా నియంత్రణ చేయిదాటి పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల వల్లే కరోనా పెరుగుతుందన్న చర్చ కూడా సాగుతోంది. దీనిపై ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించి కరోనా నియంత్రణ చేస్తుందా.. లేక దీని నుంచి ప్రజలే కాపాడుకోవాలని చెప్పి చేతులెత్తేస్తుందా అన్న అనుమానాలు తెలంగాణ వాసుల్లో వ్యక్తమవుతున్నాయి.

You might also like