FbTelugu

ఏపితో నీటి కయ్యానికి సిద్ధమైన తెలంగాణ

హైదరాబాద్: ఏపి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు వెంటనే ఆపేయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినా ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆపడం లేదని, కొనసాగిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ట్రిబ్యునల్ ఆదేశాలను కృష్ణా బోర్డు అడ్డుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. ప్రాథమిక పనులు అని చేప్పి పూర్తిస్థాయిలో పనులు చేస్తున్నదని ఆక్షేపించింది. కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు పనులు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తింది. కృష్ణా జలాల్లో న్యాయబద్దమైన వాటాను పరిరక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.